What is Keto Diet? | Benefits And Side Effects of Keto Diet | Keto Diet in Telugu

3 Views
administrator
administrator
06/14/23

What is Keto Diet? | Benefits And Side Effects of Keto Diet | Keto Diet in Telugu

డా. రవీంద్ర రెడ్డి సిద్దు, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు, ఈ వీడియో లో కీటో డైట్ గురించి పూర్తిగా వివరించారు.

0:00 - కీటో డైట్
తీసుకునే ఆహారం లో కార్బోహైడ్రేట్లు శాతం తగ్గించేసి, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే కీటో డైట్ అంటారు.

0:44 - కీటో డైట్ ఉపయోగాలు
-బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
-పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది
కీటో డైట్ వల్ల ఫలితాలు తెలియడానికి రెండు నుండి మూడు వారాలు సమయం పడుతుంది.

1:04 - కీటో డైట్ వల్ల బరువు ఎలా తగ్గుతుంది?
మనం తీసుకునే సమతుల్య ఆహారంలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు కలిగి ఉంటాయి. కార్బోహైడ్రేట్లు 40% - 60% వరకు, కొవ్వు పదార్ధాలు 25% - 35% వరకు, ప్రోటీన్లు 5% - 20% వరకు కలిగి ఉంటాయి.
-కీటో డైట్ లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ల శాతం 50% నుండి 5% కి తగ్గిపోతుంది.
-కొవ్వు పదార్ధాలు మాత్రం 25% నుండి 75% కి ఎక్కువ తీసుకోవాలి.
-20 % వరకు ప్రోటీన్లు తీసుకోవాలి
ఇలా కార్బోహైడ్రేట్లు శాతం తగ్గించేసి, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే కీటో డైట్ అంటారు.
శరీరంలో కొవ్వు పదార్ధాలు ఉపయోగించుకున్నపుడు మనకి శక్తి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది, దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

4:05 - కీటో డైట్ చేస్తే వ్యాయామం అవసరమా?
కీటో డైట్ చేస్తూ వ్యాయామం చేయకపోతే ఫలితాలు అంతగా ఉండవు, అంతే కాకుండా వ్యాయామం చేయకపోతే దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.

4:35 - కీటో డైట్ వల్ల ముఖ్యంగా ఎవరికి ఉపయోగం?
- డయాబెటిస్ ఉన్న వ్యక్తులకి.
-బకాయం ఉన్న వ్యక్తులకి.
-కొన్ని క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది.

5:34 - కీటో డైట్ ఎవరికి ఉపయోగపడదు?
-ఎక్కువగా మద్యం తీసుకునే వ్యక్తులకి.
-కీటో డైట్ వల్ల కొన్ని క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
-ఆహార అలెర్జీలు ఉన్న వ్యక్తులకి.
కీటో డైట్ పాటించాలి అంటే కూడా దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఏ ఆహారం ఎంత శాతం లో తీసుకోవాలి అనేది వైదుడి సలహాలు తీసుకొని పాటించాలి. కీటో డైట్ వల్ల దీర్ఘకాలిక ఉపయోగాలు మాత్రం ఉండవు.

మరిన్ని వివరాల కోసం వీడియోని పూర్తిగా వీక్షించండి!

#ketodiet #benefitsofketodiet #sideeffectsofketodiet #medicoverhospitals

For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook: https://www.facebook.com/MedicoverHospitals/
Instagram: https://www.instagram.com/MedicoverHospitals/
Twitter: https://twitter.com/MedicoverIn
Linkedin: https://www.Linkedin.com/compa....ny/MedicoverHospital

Show more

0 Comments Sort By

No comments found

Facebook Comments

Up next